టోనీ అలామో క్ టి యన్ మినిస్ ట్ రీస్ రి స్ నూతన యెరూషలేము
పాస్ట ర్ టోనీ అలామో
అంతర్జాతీయ సమాచారపత్రిక
ప్రపంచవ్యాప్త సంఘములు
అలామో క్రిస్టి య న్ నేషన్
దేవునిని ఎలా సమీపించాలి టోనీ అలామో
ప్రకటన 3:14-17 చెప్తుంది, “లవొదికయలో (టర్కీలో ఉన్నది) ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: ‘ఆమెన్’ అనువాడును (యేసు), నమ్మకమైన సత్యసాక్షియు (యేసు), దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా; ‘నీ క్రియలను నేను (యేసు) ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. (నీవు నులివెచ్చగా ఉండటం కంటే వీటిలో ఏదైన ఒక విధంగా ఉండి ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాని నీవు నులివెచ్చగా ఉన్నావు!) నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట (నా శరీరము) నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను’. నీవు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు”. నేటి కోటీశ్వరులను, లక్షాధికారులను ఇది గుర్తుచేస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో వాళ్లు ఎప్పటికీ జీవిస్తారని మూర్ఖంగా నమ్ముతారు (కీర్తన 49:6-14). వాళ్లు నిత్యమూ పరలోకంలో గాని నరకంలో గాని జీవిస్తారు; వాళ్లు పశ్చాత్తాపము చెందితే పరలోకంలో, పశ్చాత్తాపము చెందకపోతే నరకంలో. లూకా 16:19-31 చెప్తుంది, “ధనవంతుడొకడుండెను, అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సు-
ఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను (పరలోకమునకు). ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి ‘తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నాను’, అని కేకలువేసి చెప్పెను. “అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నది’, అని చెప్పెను. అప్పుడతడు ‘తండ్రీ, ఆలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు.
సంచిక 23400
పాస్టర్ టోనీ అలామో 1986లో తీసిన ఫొటో
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను’, అనెను. అందుకు అబ్రాహాము ‘వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెను’, అని అతనితో చెప్పగా అతడు ‘తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురు’, అని చెప్పెను. అందుకతడు ‘మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు’, అని అతనితో చెప్పెననెను”. దీనిని సులువుగా నిరూపించవచ్చు. యేసు మృతులలోనుండి లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోవడాన్ని ఐదువందల మందికి 1 పైగా చూచారు, అయినను
ప్రజలు ఇంకా నమ్మరు. ధనవంతుడు ప్రార్థించడానికి ఎంచుకున్న సమయం సరియైనది కాదు. మనం నిత్యత్వము యొక్క ఇటు వైపు ప్రార్థించాలి గాని నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కాదు.2 దేవుడు విశ్వాన్ని సృజించినపుడు, సృజించబడినవాడు ఆయన పరిపూర్ణతలో, ఆశీర్వాదంలో పాలిభాగస్తుడు కావాలనే ఒక్క ఉద్దేశంతో సృజించారు. దానిలో ఆయన ప్రేమను, జ్ఞానాన్ని, శక్తిని కనుపర్చారు. (తరువాయి 2వ పేజీలో)
1 అపొస్తలుల కార్యములు 1:1-11, 1 కొరింథీయులకు 15:3-6 2 1 దినవృత్తాంతములు 28:9, 2 దినవృత్తాంతములు 7:14, 15:2, 19:3, సామెతలు 1:20-33, 8:17, యెషయా 55:6-7, యిర్మియా 9:23-24, ఆమోసు 5:6-8, మత్తయి సువార్త 7:7-8, మార్కు సువార్త 11:20-24, హెబ్రీయులకు 9:27
1